Sounds familiar?

— తాడి సూరయ్య

తాత ఎప్పుడూ అదేదో పద్యం భలే పాడేవాడురా — కొండముచ్చులకు గుడి గోపురాలు సభాస్థలంబులు — అని, నీకు గుర్తుందా?

మా అమ్మ గమ్మత్తైన సామెత చెప్పేది, దీని గురించే — పునిస్త్రీ ఇస్తరాకు గెడ్డపలుగు — అనో ఏదో.

తిలక్కో, కృష్ణశాస్త్రో ఇలాంటిదే చెపుతాడురా — పైయ్యెద బరువులకు వంగిన ఆమె విల్లులాగా ఉంది — అని

అవునా నీకు ఈ కథ అంత బాగుందా? ఇంచుమించు ఇలాంటిదే ఇదివరకు చదివాను ఎక్కడో. పేర్లు సీన్లు కొంచెం మారాయి అంతే.

పొద్దున్నుంచీ ఆ పాటే నోట్లో నానతంది కానీ సరిగ్గా గుర్తుకొచ్చి సావట్లేదు.

ఇక్కడకు వచ్చారు. చాలా సంతోషం.

ఇలాంటి ఎన్నో సందేహాలు సశేషాలుగా మిగిలి పోకూడదనే నా ఈ ప్రయత్నం. జ్ఞాపకాలలో, పారేసుకున్న పుస్తకాలలో, గతవైభవాలలో, డిజిటల్ ఆర్కైవులలో భద్రముగా ఉన్న తెలుగుతనాన్ని కొత్త పుంతలు తొక్కించడమే నా ఆశయం.

ఆశీర్వదించండి.

అల్లసాని వారి అల్లిక జిగిబిగి అంటారు, ఈయనే..

అల్లిక అంటే.. ఆయన టైలరింగు చేసేవారా..?

ఇది..మన తెలుగు కావ్యాల కర్మ — అని ఒకసారి తలకొట్టేసుకుని వెళ్లిపోను.

పద్యం బ్రహ్మపదార్థం కాదు.

ఆ ఒడుపు పట్టుకుంటే ఫైన్ వైన్ లాగా మీరు ఇంకే కవిత్వాన్ని ముట్టుకోరు. సంధిసమాసాలంకారభూయిష్టమైన పద్యాల అందాలని మీకు అందించడమే నా లక్ష్యం.

అవధానిగారో మరెవరో గుక్కతిప్పుకోకుండా పాడిన పద్యాన్నో, మీకు ఒక్కముక్క కూడా అర్థము కాదు అనుకున్న దాన్నో ఎంచుకోండి.

1

ఇక్కడ వెదకండి.

2

ఆ పద్యాన్ని తెరవండి. జాగ్రత్తగా చూడండి.

3

పదచ్ఛేదం — అంటే సంధులని దీర్ఘ సమాసాలని విడగొట్టడం — చేయండి.

4

ఇప్పుడు అదే పద్యము ఎంత సుళువుగా ఉంటుందో చూడండి.

5

ఇంకా అందులో కొన్ని పదాలు అర్థము కాలేదా? డిక్ష్టనరీలు అక్కరలేదు. అక్కడే ఆ పదాలను నొక్కండి.

6

ఇప్పుడు పద్యం మొత్తం మళ్లీ చదవండి.

ఎందుకు అర్థముకాదో నేనూ చూస్తాను!!

“భాష అదీ చాలా కష్టం, నాకు అర్థం కాదు” అని సారస్వత మంజూషాన్ని తెరిచే ప్రయత్నం కూడా చేయని మన నిరాసక్తతను పటాపంచలు చేసి పుస్తకాలను మళ్లీ సరికొత్తగా చదివించడమే

నా ఛాలెంజ్!!

సహకరించండి.

Why Taadichettu?

తెలుగుతనానికి ఇంతకన్నా మంచి ప్రతీక ఇంకేదైనా ఉందా?

“...ఇది నిస్సందేహముగా ఆంధ్రకల్పవృక్షము.”— వేటూరి ప్రభాకరశాస్త్రి

నాడు తాళపత్రాలతో తెలుగును అందించింది.

ఈ తాడిచెట్టు నవతరానికి తెలుగును నవ్యంగా అందిస్తుంది.

ఆస్వాదించండి.

తాడి సూరయ్య